HomeతెలంగాణIndalwai | వరుస చోరీలు.. దొంగను పట్టుకున్న గ్రామస్థులు

Indalwai | వరుస చోరీలు.. దొంగను పట్టుకున్న గ్రామస్థులు

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను గ్రామస్థులు వలవేసి పట్టుకున్నారు. ఈ ఘటన ఇందల్వాయి(Indalwai) గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం.. గతవారం ఏడిళ్లల్లో ఒకేరోజు చోరీలు జరిగాయి. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు ప్రతిరోజు గస్తీ(patrolling) తిరుగుతున్నారు. గురువారం రాత్రి సైతం కారు​లో వచ్చిన నలుగురు దొంగలు గ్రామంలోని షేక్​ నిస్సార్​ హైమద్​ ఇంట్లో చోరీ చేశారు. అనంతరం మరో ఇంట్లో చోరీ చేసేందుకు వెళ్తుండగా గ్రామస్థులు వెంబడించి ఓ దొంగను పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు(indalwai Police) అప్పగించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామస్థుడు షేక్​ నిస్సార్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.