HomeతెలంగాణRobberies in Houses | ఇందల్వాయిలో వరుస చోరీలు..​

Robberies in Houses | ఇందల్వాయిలో వరుస చోరీలు..​

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Robberies in Houses | ఇందల్వాయిలో వరుస చోరీ ఘటనలు ప్రజలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. గత 15 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు దొంగ​లు హల్​చల్​ చేశారు.

శనివారం రాత్రి సైతం ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గంగాదాస్​ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి దాబామీద పడుకున్నాడు. ఆదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాను ధ్వంసం చేశారు. అందులో నగదు ఎత్తుకెళ్లారు. వరుస చోరీలకు అడ్డుకట్ట వేసేలా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.