అక్షరటుడే, వెబ్‌డెస్క్ : American Ambassador | భారత్‌పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా(India)తో వాణిజ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. నూతన రాయబారిగా తనకు అత్యంత ఆప్తమిత్రుడైన వ్యక్తికి నియమించారు.
ట్రంప్ నమ్మిన బంటుగా పేరొందిన సెర్గియో గోర్ రాస్(Sergio Gore Ross)(38) ను భారత అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బ తింటున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గోర్ నియామకాన్ని ట్రంప్(Donald Trump) సోషల్ మీడియా వేదికా ప్రకటించారు. ‘సెర్గియో గోర్‌ను భారత్‌కు రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక చేశాను’ అని పేర్కొన్నారు.
American Ambassador | ట్రంప్ అనుచరుడిగా..
గోర్ ప్రస్తుతం వైట్ హౌస్(White House) ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన రాయబారిగా బాధ్తయలు చేపట్టే వరకు ఈ పదవిలోనే కొనసాగుతారని ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్‌గా, గోర్. అతని బృందం తమ ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో రికార్డ్ సమయంలోనే దాదాపు 4,000 మంది అమెరికా ఫస్ట్ పేట్రియాట్‌లను (దేశ భక్తులుగా భావించే) నియమించుకున్నారని. తన విభాగాలు. ఏజెన్సీలు ’95 శాతానికి పైగా నిండిపోయాయని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. “ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఆసియా ప్రాంతానికి, నా అజెండాను అందించడానికి, అమెరికాను తిరిగి గొప్పగా మార్చడానికి మాకు సహాయం చేయడానికి నేను పూర్తిగా విశ్వసించగల వ్యక్తి ఉండటం ముఖ్యం” అని ట్రంప్ గోర్‌ను అభినందిస్తూ పేర్కొన్నారు. గోర్ తనకు గొప్ప స్నేహితుడని, అధ్యక్ష ఎన్నికల ప్రచారాలలో విస్తృతంగా పనిచేశారని, తన అత్యధికంగా అమ్ముడైన అనేక పుస్తకాలను కూడా ప్రచురించారని ట్రంప్ అన్నారు.
American Ambassador | విష సర్పమన్న మస్క్..
మీడియాలో ఎక్కువగా కనిపించని సెర్గియో గోర్‌కు పవర్ ఫుల్ నేతగా పేరుంది. ఆయన చెప్పింది ట్రంప్ వింటారన్న ప్రచారం కూడా ఉంది. ఇటీవలి వాణిజ్య ఉద్రిక్తతలకు కూడా ఆయనే కారణమన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎలాన్ మస్క్(Elon Musk), ట్రంప్ మధ్య వైరం ముదరడం వెనుక కూడా గోర్ ఉన్నారని మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఓ సందర్భంలో సెర్గియోను విష సర్పంగా పేర్కొన్నారు. నాసాలో తన అభిమతానికి అనుగూణంగా వ్యక్తుల నియామకానికి గోర్ అడ్డుపడ్డారంటూ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ విదేశీ పర్యటనల్లో కొన్నిసార్లు పాల్గొన్న సెర్గియో గోర్, కొందరు జాతీయ భద్రతా మండలి సభ్యుల తొలగింపునకు కారణమయ్యారు.
American Ambassador | ఉజ్బెకిస్తాన్, ఇజ్రాయిల్ మూలాలు..
గోర్ మూలాలు ఉజ్బెకిస్తాన్‌లో ఉన్నాయి. 1986 నవంబర్ 30న ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జన్మించిన గోర్ అసలు ఇంటి పేరు గోరోఖోవ్స్కీ. 1999లో అతని కుటుంబం లాస్ ఏంజిల్స్‌కు వలస వచ్చింది. అక్కడే అతను చదువుకున్నాడు. తరువాత, జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివాడు. అతని తల్లి ఇజ్రాయెల్ మూలాలు కలిగి ఉండగా, అతని తండ్రి యూరి గోరోఖోవ్స్కీ సోవియట్ మిలిటరీ కోసం విమాన రూపకల్పనలపై పనిచేసే ఏవియేషన్ ఇంజినీర్ కావడం గమనార్హం.