అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Komatireddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు (Jubilee Hills by-elections) సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. మంత్రులు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ దోపిడీని భరించలేకపోయారన్నారు. అందుకే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ను (BRS) ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పని చేయదన్నారు. గతంలో కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) చనిపోవడంతో ఉప ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారన్నారు. ప్రస్తుతం కూడా సెంటిమెంట్ పని చేయదని, కాంగ్రెస్ అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్నారు.
Minister Komatireddy | బీఆర్ఎస్ పట్టించుకోలేదు
కాంగ్రెస్ హయాంలో పి జనార్ధన్‌రెడ్డి (P Janardhan Reddy) చేసిన అభివృద్ధి తప్పా.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌కు ఏం చేయలేదన్నారు. నియోజకవర్గంలోని బస్తీలను పట్టించుకోలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా నడుస్తోందన్నారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలువబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా.. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి తమ అభ్యర్థిపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినప్పుడే బీఆర్ఎస్ ఓడిపోయినట్లు లెక్క అన్నారు. నవీన్ యాదవ్ (Naveen Yadav) రౌడీ అయితే పోయిన ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయో బీఆర్ఎస్ నేతలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
Minister Komatireddy | 90 శాతం పేదలే..
జూబ్లీహిల్స్ అంటే అందరు కోటీశ్వరులు ఉండే ప్రాంతం అనుకుంటారని కోమటిరెడ్డి అన్నారు. కానీ పది శాతం మాత్రమే ధనవంతులు ఉంటారని, 90 శాతం పేదలు బస్తీల్లో నివసిస్తారని చెప్పారు. బస్తీల అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నియోజకవర్గంలో 45 వేల మందికి రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో కేసీఆర్ ఒక కొత్త రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
