Sensex Nifty Gains | లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 479 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు లాభపడ్డాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్:Sensex Nifty Gains | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వివిధ దేశాలపై విధించిన సుంకాలను అక్కడి సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధమంటూ కొట్టివేయడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర దిగిరావడం, రూపాయి విలువ బలపడడం వంటి కారణాలతో ప్రధాన సూచీలు పరుగులు తీశాయి.

దీంతో వరుసగా రెండో సెషన్‌లోనూ ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. అయితే సుప్రీంకోర్ట్ (Supreme Court) తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన యూఎస్ ప్రెసిడెంట్.. 15 శాతం తాత్కాలిక సుంకాలను విధించడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధభయాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో లాభాలు కాస్త తగ్గాయి.

సోమవారం ఉదయం సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 580 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 580 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 93 పాయింట్లు పైకి ఎగబాకింది. గరిష్టాలవద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 145 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 479 పాయింట్ల లాభంతో 83,294 వద్ద, నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 25,713 వద్ద స్థిరపడ్డాయి.

ఆటో, పవర్, రంగాల్లో కొనుగోళ్ల మద్దతు..

ఆటో, పవర్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాల షేర్లు అర శాతానికిపైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.40 శాతానికిపైగా నష్టపోయింది.
మెటల్, రియాలిటీ, బ్యాంకెక్స్ నష్టాలతో ముగిశాయి.

అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,926 కంపెనీలు లాభపడగా 2,389 స్టాక్స్ నష్టపోయాయి. 182 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 124 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 238 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో, 11 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదానిపోర్ట్స్ 2.98 శాతం, కొటక్ బ్యాంక్ 2.22 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.55 శాతం, పవర్‌గ్రిడ్ 1.49 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.34 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 1.80 శాతం, టెక్‌మహీంద్రా 1.06 శాతం, ట్రెంట్ 0.83 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.74 శాతం, బజాజ్‌ఫిన్‌సర్వ్ 0.53 శాతం నష్టపోయాయి.

Related articles

Advocate Attack Case | న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రుద్రూర్​లో న్యాయవాది కళ్యాణిపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.

Peaceful Municipal Elections | అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు పలువురు అధికారులను సన్మానించారు.

Nizamabad Deputy Mayor | డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు సందర్భంగా ఆమెకు మేయర్​ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Kamareddy DMHO Appointment | కామారెడ్డి డీఎంహెచ్​వోగా రవీందర్ గౌడ్

కామారెడ్డి డీఎంహెచ్​వోగా డాక్టర్ రవీందర్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్​ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.