stock market | ఏడో రోజూ పైపైకే.. 80 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్​: stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock markets)లో ర్యాలీ కొనసాగుతోంది. ప్రధాన సూచీలు వరుసగా ఏడో రోజూ పాజిటివ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం 547 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. మొదట ఒడిదుడుకులకులోనై ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి 636 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11 గంటల తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో తిరిగి లాభాలబాట పట్టింది. నిఫ్టీ 190 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా.. అమ్మకాల ఒత్తిడి(Selling pressure)తో ఇంట్రాడేలో గరిష్టంగా 250 పాయింట్లకుపైగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock markets)లో ర్యాలీ కొనసాగుతోంది. ప్రధాన సూచీలు వరుసగా ఏడో రోజూ పాజిటివ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం 547 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. మొదట ఒడిదుడుకులకులోనై ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి 636 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11 గంటల తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో తిరిగి లాభాలబాట పట్టింది.

నిఫ్టీ 190 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా.. అమ్మకాల ఒత్తిడి(Selling pressure)తో ఇంట్రాడేలో గరిష్టంగా 250 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. ట్రేడింగ్‌(Trading) ముగిసే సమయానికి సెన్సెక్స్‌ sensex 520 పాయింట్ల లాభంతో 80,116 వద్ద, నిఫ్టీ 161 పాయింట్ల లాభంతో 24,328 వద్ద స్థిరపడ్డాయి.

చైనా(China)తో టారిఫ్‌ వార్‌ విషయంలో ట్రంప్‌ trump కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు కనిపించడం, ఫెడ్‌ చైర్మన్‌ విషయంలోనూ మొండిపట్టును వీడడంతో మార్కెట్లు markets సానుకూలంగా స్పందించాయి. షాంఘై(Shanghai) మినహా అన్ని ప్రధాన స్టాక్‌ మార్కెట్లు stock markets లాభాలబాటలో పయనించాయి. అమెరికా(America)తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉందన్న సంకేతాలతో మన మార్కెట్లు కూడా పరుగులు తీశాయి. అయితే ఇటీవలి కాలంలో జోరుమీదున్న బ్యాంకింగ్‌(Banking) స్టాక్స్‌లో బుధవారం ప్రాఫిట్‌ బుకింగ్‌ profit booking కనిపించింది. అయినా ఐటీ(IT), ఆటో, ఫార్మా రంగాల షేర్లు రాణించడంతో ప్రధాన సూచీలు లాభాల్లో ముగిశాయి.

బీఎస్‌ఈలో BSE నమోదైన కంపెనీలలో 2,078 లాభాలతో, 1,873 నష్టాలతో ముగియగా.. 155 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి.

81 కంపెనీలు 52 వారాల గరిష్టాలకు చేరగా.. 25 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద ట్రేడ్‌ trade అయ్యాయి. 7 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 5 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

stock market | రాణించిన ఐటీ, ఆటో, ఫార్మా రంగాలు..

బీఎస్‌ఈ(BSE) మిడ్‌ క్యాప్‌ ఒక శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ అర శాతానికిపైగా పెరిగాయి. ఐటీ ఇండెక్స్‌(IT index) నాలుగు శాతం వరకు లాభపడింది. ఆటో ఇండెక్స్‌ 2.5 శాతం పెరగ్గా.. రియాలిటీ, ఫార్మా(Pharma), పవర్‌, మెటల్‌ రంగాల షేర్లూ రాణించాయి. బ్యాంకెక్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌లు ఒక శాతం వరకు నష్టపోయాయి.

Top Gainers

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ముగియగా ఆరు కంపెనీలు మాత్రం నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా హెచ్‌సీఎల్‌ టెక్‌(HCL tech) 7.72 శాతం పెరిగింది. టెక్‌ మహీంద్రా tech mahindra, టాటా మోటార్స్‌ tata motors నాలుగు శాతానికిపైగా పెరగ్గా.. ఇన్ఫోసిస్‌(Infosys), ఎంఅండ్‌ఎం మూడు శాతానికిపైగా లాభపడ్డాయి. టీసీఎస్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌ రెండు శాతానికిపైగా పెరిగాయి.

Top Losers

కొటక్‌ బ్యాంక్‌(Kotak bank) 2.07 శాతం పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ 1.98 శాతం, ఎస్‌బీఐ 1.11 శాతం నష్టపోయాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...