ePaper
More
    Homeక్రైంSrishti Test Tube Baby Center | సృష్టి టెస్ట్​ ట్యూబ్ బేబీ సెంటర్​ కేసులో...

    Srishti Test Tube Baby Center | సృష్టి టెస్ట్​ ట్యూబ్ బేబీ సెంటర్​ కేసులో సంచలన విషయాలు.. ఏడుగురు నిందితుల రిమాండ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srishti Test Tube Baby Center | సికింద్రాబాద్​లోని సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ (Test Tube Baby Center) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్​ (Secunderabad)తో పాటు, విజయవాడ, విశాఖపట్నంలో సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    Srishti Test Tube Baby Center | అసలు ఏం జరిగిందంటే..

    ఓ జంటకు వివాహమై ఏడేళ్లు అవుతున్నా పిల్లలు కాలేదు. దీంతో సికింద్రాబాద్​లోని (Secunderabad)​ సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్​ను ఆశ్రయించారు. సదరు మహిళ అండం, ఆమె భర్త వీర్యంతో సెంటర్​లో పిండం అభివృద్ధి చేయాలి. అయితే సెంటర్​ నిర్వాహకులు ఆమె భర్త వీర్యంతో కాకుండా మరో వ్యక్తి వీర్యంతో పిండం అభివృద్ధి మహిళ గర్భంలో ప్రవేశ పెట్టారు. ఆమెకు బాబు పుట్టగా.. అతడికి క్యాన్సర్​ ఉన్నట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు డీఎన్​ఏ టెస్ట్ (DNA Test) చేయించగా.. అసలు విషయం వెలుగు చూసింది. తన భర్త వీర్యంతో కాకుండా వేరొకరి స్పెర్మ్​తో బిడ్డ పుట్టేలా చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సెంటర్లలో తనిఖీలు చేపట్టారు.

    READ ALSO  CBI Trap | లంచం తీసుకుంటూ దొరికిన ఇన్​కం ట్యాక్స్​ ఇన్​స్పెక్టర్​

    Srishti Test Tube Baby Center | లైసెన్స్​ రద్దు చేసినా..

    డాక్టర్​ నమ్రత (Doctor Namratha) సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​ నడుపుతోంది. తల్లి కావాలనే మహిళల ఆశను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతోంది. ఈమె గతంలో సైతం అక్రమాలకు పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారు. లైసెన్స్​ రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం ఇతరులపై పేరుపై టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ నిర్వహిస్తోంది. విజయవాడలో ముగ్గురు డాక్టర్ల ద్వారా ఈమె కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐవీఎఫ్​ పేరిట ఇతరుల వీర్యంతో ఇలా చాలా మందికి పిల్లలు కలిగేటట్లు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. మారేడ్​పల్లి జడ్జి ఎదుట నమ్రమతతో పాటు ఏడుగురి నిందితులను ఆదివారం ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్​ విధించారు.

    READ ALSO  Hyderabad | ఫ్రిజ్​ డోర్ తీస్తుండగా కరెంట్​ షాక్​.. మహిళ మృతి

    Srishti Test Tube Baby Center | స్పెర్మ్‌ క్లినిక్‌పై పోలీసుల దాడులు

    హైదరాబాద్​​లోని (Hyderabad) ఇండియన్‌ స్పెర్మ్ టెక్ క్లినిక్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్‌ సేకరిస్తున్నట్టు గుర్తించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్పెర్మ్‌ డొనేటర్లకు రూ.4 వేల వరకు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా క్లినిక్‌ నిర్వహిస్తుండడంతో కేసు నమోదు చేశారు.

    Latest articles

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    More like this

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...