అక్షరటుడే, వెబ్డెస్క్ : Kidney racket case | సరూర్నగర్ కిడ్నీ రాకెట్ కేసు(Kidney racket case)లో సీఐడీ దూకుడు పెంచింది. సరూర్ నగర్ (Saroor Nagar)లోని అలకనంద ఆసుపత్రి వేదికగా కిడ్నీ రాకెట్ నడిచిన విషయం తెలిసిందే. జనవరిలో ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసిన సీఐడీ(CID) తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం గాలిస్తోంది.
తాజాగా తమిళనాడు(Tamilnadu)కు చెందిన శంకరన్, రమ్యను అరెస్ట్ చేశారు. వారి నుంచినుంచి పాస్ పోర్టులతో రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకునారు. చెన్నైలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కి తరలిస్తున్నారు.
Kidney racket case | కిడ్నీ అమ్ముకొని.. దందా వైపు మళ్లాడు
కిడ్నీ రాకెట్ కేసుల ప్రధాన నిందితుడు విశాఖపట్నం(vishakapatnam)కు చెందిన పవన్ అలియాస్ లియోన్ గతంలో కిడ్ని రాకెట్ దందాకు చిక్కి తాను కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే కిడ్నీ దాతల కంటే దళారులకే ఎక్కువ డబ్బు వస్తుందని ఆయన గ్రహించాడు. ఈ క్రమంలో తానే స్వయంగా రంగంలోకి కిడ్నీ రాకెట్ నిర్వహించడం మొదలు పెట్టాడు. పేదవారిని లక్ష్యంగా చేసుకొని కిడ్నీలు తీసుకొని విక్రయించేవాడు.
కిడ్నీ కావాల్సిన వారికి రూ.50లక్షల నుంచి రూ.60 లక్షల వరకు విక్రయించేవాడు. దాతలకు రూ.ఐదు లక్షలు, వైద్యులకు రూ.10 లక్షలు, ఆస్పత్రికి రూ.2.5 లక్షలు, సిబ్బంది రూ.1.5 లక్షల వరకు ఇచ్చేవాడు. అంతాపోను భారీగా మిగులుతుండటంతో దందాను విస్తరించాడు. అయితే తన ఆచూకీ దొరకకుండా తరుచు ప్రాంతాలు మార్చేవాడు. ఈ క్రమంలో ఇతర నగరాల్లో కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ మకాం మార్చాడు. ఇక్కడ కూడా కేసు నమోదు కావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.