Homeక్రైంVizianagaram | పేలుళ్ల కుట్ర కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Vizianagaram | పేలుళ్ల కుట్ర కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizianagaram | హైదరాబాద్​ hyderabadలో పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్​ hyderabadలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయనగరానికి vizianagaram చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ కలిసి పేలుళ్లు జరపాలని ప్లాన్​ వేశారు. ఐసిస్ isis​ సహకారంలో వీరు పేలుళ్లకు కుట్ర పన్నారని గుర్తించి అరెస్ట్​ చేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో అధికారులు పలు కీలక విషయాలు గుర్తించారు.

Vizianagaram | నాలుగు రాష్ట్రాల్లో దాడులకు ప్లాన్​

పహల్​గామ్​​ ఉగ్రదాడి pahalgam terror attack, ఆపరేషన్​ సిందూర్​ operation sindoor అనంతరం భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ సిందూర్​తో భారత్​ పాక్​లోని ఉగ్రవాదులపై దాడులు చేసింది. ఈ క్రమంలో సమీర్​, సిరాజ్​ కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు పథకం పన్నారు. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు కుట్ర చేశారు. సమీర్ ఆరుగురు సభ్యులతో అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు.

మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్‌ రెహ్మాన్‌, సమీర్​తో కలిసి దాడులకు పన్నాగం పన్నాడు. ఐసిస్​ సహకారంతో వీరు దాడులు చేయాలని యోచించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు.

Vizianagaram | దిల్​సుఖ్​నగర్​ పేలుళ్ల తరహాలో..

హైదరాబాద్​లోని దిల్​సుఖ్​నగర్​ dilsukh nagarలో 2013లో జంట పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని నిందితులు ప్లాన్​ వేశారు. విజయనగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ వారంలోనే పేలుళ్లకు కుట్ర చేశారు.

ముఖ్యంగా స్లమ్​ ఏరియాల్లో బాంబులు పెట్టాలని పథకం పన్నినట్లు సమాచారం. దీంతో అధికారులు వారిని విచారిస్తున్నారు. విజయనగరం నుంచి ఎన్​ఐఏ అధికారులు విశాఖ వెళ్లారు. సిరాజ్, సమీర్​ను వారు కస్టడీలోకి తీసుకోనున్నారు. సిరాజ్ తండ్రి, సోదరుడిని విజయనగరం టూటౌన్ పోలీస్​ స్టేషన్​లో పోలీసులు విచారిస్తున్నారు.