అక్షరటుడే, కామారెడ్డి: Mla KVR | అసెంబ్లీకి కొత్తగా వచ్చిన తాము సీనియర్ల మాటలను చూసి నేర్చుకునేలా ఉండాలని, అలా గౌరవ సభ్యులు మాట్లాడే విధంగా చూడాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) అన్నారు. అసెంబ్లీ సమావేశాల (Assembly Session) సందర్భంగా సోమవారం జీరో అవర్లో సభ్యులు మాట్లాడే మాటతీరుపై ఎమ్మెల్యే కేవీఆర్ స్పందించారు.
Mla KVR | సద్విమర్మలు చేయాలి..
సభలో మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని గౌరవించేలా విమర్శలు, సద్విమర్శలు ఉండాలని కేవీఆర్ అన్నారు. మాటల విషయంలో సభ్యులను సరైన దారిలో పెట్టాలని కోరారు. ఒకరిమీద ఒకరు మాట్లాడుకుని రికార్డుల్లోకి కూడా తీసుకోని పరిస్థితి ఉందన్నారు.
Mla KVR | కేసీఆర్ నుంచి.. రేవంత్ రెడ్డి దాకా..
మీడియా సైతం సీఎంలు, పీఎంలు తమ చిన్ననాటి మిత్రులైనట్లు ఏకవచనంతో సంభోదించే పరిస్థితి రావడానికి కారణం మనమేనని ఎమ్మెల్యే అన్నారు. బూతులు మాట్లాడడం అవలక్షణమని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరకు ఎమ్మెల్యేలు, మంత్రులకు వచ్చే శాసన సభకు మంచి సందేశం ఇవ్వాలన్నారు. మీడియా ముందు మాట్లాడి తమను తాము దిగజార్చుకుంటున్నామన్నారు.
Mla KVR | మీ పార్టీ వాళ్లకు కూడా చెప్పండి: మంత్రి శ్రీధర్ బాబు సమాధానం..
సభలో మాట్లాడే విధానంపై మీ పార్టీ సభ్యులకు కూడా చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేవీఆర్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. హుందాతనాన్ని కాపాడేందుకు, తెలంగాణ సంస్కృతిని కాపాడే విషయంలో స్పష్టంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తమకు భేషజాలు లేవని, ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాన్ని గౌరవిస్తామన్నారు.