Female civil judge resigns | వేధింపులకు పాల్పడిన సీనియర్​ న్యాయమూర్తికే పదోన్నతా..? అంటూ మహిళా సివిల్​ జడ్జి రాజీనామా..!
Female civil judge resigns | వేధింపులకు పాల్పడిన సీనియర్​ న్యాయమూర్తికే పదోన్నతా..? అంటూ మహిళా సివిల్​ జడ్జి రాజీనామా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Female civil judge resigns : మధ్యప్రదేశ్​లోని (Madhya Pradesh) శహడోల్‌లో (Shahdol) జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి అదితి కుమార్ శర్మ (Junior Division Civil Judge Aditi Kumar Sharma) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనపై వేధింపులకు పాల్పడిన సీనియర్ న్యాయమూర్తికి ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హైకోర్టు (High Court) ప్రధాన న్యాయమూర్తికి (Chief Justice) జులై 28న పంపిన తన రాజీనామా లేఖలో సివిల్​ జడ్జి అదితి ఇలా రాశారు. “న్యాయ వ్యవస్థను నేను విఫలపర్చలేదు. న్యాయవ్యవస్థే నన్ను విఫలపర్చింది. అందుకే నేను రాజీనామా చేస్తున్నా.”

“ఎదుర్కోలేని అధికారంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి చేతుల్లో ఏళ్ల తరబడి వేధింపులకు గురయ్యా..” అని న్యాయమూర్తి అదితి కుమార్​ శర్మ వాపోయారు.

తాను ఆ సీనియర్ న్యాయమూర్తిపై ఆధారాలతో సహా ఆరోపణలు చేసినా కూడా.. ఇప్పటికీ ఏ విచారణ చేపట్టలేదని, నోటీసు ఇవ్వలేదని, వివరణ కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, పదోన్నతి కల్పించారని జడ్జి లేఖలో రాశారు.

Female civil judge resigns : ప్రతీకారం కాదు.. న్యాయం కోరాను..

తాను ప్రతీకారం కోరలేదని, న్యాయం(justice) కోరినట్లు సివిల్ జడ్జి అదితి కుమార్ శర్మ గుర్తుచేశారు. తన కోసమే కాదు, తాను విశ్వసించిన న్యాయవ్యవస్థ కోసమే న్యాయం కోరినట్లు ఆమె పేర్కొన్నారు. “నేను ఇప్పుడు వెళ్లిపోతున్నా.. నన్ను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నా.. నష్ట వివరణ ఇచ్చినా.. క్షమాపణ చెప్పినా కూడా నా గాయాలు ఇక తగ్గవు..” అని తన ఆవేదనను, బాధను రాజీనామా లేఖలో వ్యక్తపర్చారు.

Female civil judge resigns : అసలేం జరిగిందంటే..

2023లో సివిల్​ జడ్జి అదితి కుమార్ శర్మతో పాటు ఐదుగురు మహిళా న్యాయమూర్తుల విషయంలో కఠినంగా వ్యవహరించారు. ‘అసంతృప్తికర ప్రదర్శన’ కారణంగా వారిని తొలగించారు. దీనిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది.

దీంతో 2024 ఆగస్టు 1న మధ్యప్రదేశ్ హైకోర్టు తిరిగి సమీక్షించింది. తొలగించిన వారిలో నలుగురిని కొన్ని షరతులతో తిరిగి కొలువుల్లోకి తీసుకుంది. కానీ, సరితా చౌదరితోపాటు అదితి కుమార్ శర్మను తీసుకోలేదు.

Female civil judge resigns : తొలగింపుపై సుప్రీం జోక్యంతో..

కాగా, అదితి కుమార్​ శర్మ విషయంలో ఫిబ్రవరి 28, 2025న సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ అదితి కుమార్ శర్మ తొలగింపు అయోచితమైనది, చట్టవ్యతిరేకమైనది” అని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఆమెను న్యాయమూర్తిగా తిరిగి తీసుకుంది.

కాగా, తప్పుడు నిర్ణయాలతో తమను తొలగించి, వేధింపులకు పాల్పడిన న్యాయమూర్తికే తాజాగా పదోన్నతి కల్పించారనే ఆవేదనతో జడ్జి అదితి కుమార్​ శర్మ చివరికి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

Female civil judge resigns : కోర్టు మౌనానికి బలి..

“నేను కోర్టు అధికారిగా సంతకం చేయడం లేదు.. కోర్టు మౌనానికి బలైన బాధితురాలిగా రాజీనామా లేఖలో సంతకం చేస్తున్నా.. న్యాయవ్యవస్థ judiciary నన్నే కాదు.. తనని తాను మోసం చేసుకుంది,” అంటూ అదితి కుమార్​ శర్మ తన రాజీనామా లేఖను ముగించినట్లు ఎన్​డీ టీవీ కథనం పేర్కొంది.