Homeఆంధప్రదేశ్IAS Officer | సీనియర్​ ఐఏఎస్​ అధికారి కూతురు ఆత్మహత్య

IAS Officer | సీనియర్​ ఐఏఎస్​ అధికారి కూతురు ఆత్మహత్య

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్​ ఐఏఎస్ అధికారి చిన్నరాముడి కుమార్తె ఆత్మహత్య చేసుకుంది

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Officer | ఏపీ (Andhra Pradesh)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. సీనియర్​ ఐఏఎస్ అధికారి చిన్నరాముడి కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మాధురి కొన్ని నెలల క్రితం కర్నూలు జిల్లా (Kurnool District)కు చెందిన రాజేష్​ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన నాలుగు నెలలకే ఆమె పుట్టింటికి వచ్చేసింది. అత్తింటి వేధింపులు తాళలేక వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమె ఉరి వేసుకుంది.

IAS Officer | రాజేష్​ ట్రాప్​ చేశాడు

తన కూతురు మాధురిని రాజేష్​ ట్రాప్​ చేశాడని ఐఏఎస్​ అధికారి ఆరోపించారు. బలవంతంగా పెళ్లిచేసుకున్నాడని పేర్కొన్నారు. అంతకుముందు మరో అమ్మాయిని సైతం ఇలానే మోసం చేశాడని ఆరోపించారు. జల్సాలకు అలవాటు పడిన రాజేష్​ అమ్మాయిలను ట్రాప్​ చేస్తున్నట్లు చెప్పారు. అంతేగాకుండా తనతో పడని వారి బైక్​లను కాల్చేవాడన్నారు.

కాగా మాధురి సూసైడ్​కు ఆమె తల్లిదండ్రులే కారణమని భర్త రాజేష్ ఆరోపించాడు. బీటెక్ ఫెయిల్ అయినందుకు తల్లిదండ్రులు చంపాలనుకుంటున్నారని మాధురి తనకు మెసేజ్ చేసి చెప్పినట్లు చెప్పాడు. ఆమెకు బలవంతంగా అబార్షన్ కూడా చేయించారని ఆరోపించారు. కాగా ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News