అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda | స్వాతంత్ర సమరయోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డ నారాయణరావు(CPI leader Dodda Narayana Rao)(96) మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నారాయణరావు నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.
తుదిశ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారు. ఆయన శుక్రవారం రాత్రి అనారోగ్యంతో తన స్వగృహంలో మరణించారు.కాగా నారాయణరావు ఉమ్మడి నల్లగొండ జిల్లా(Nalgonda District) సీపీఐ మాజీ కార్యదర్శిగా, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా, చిలుకూరు మాజీ ఎంపీపీ(Chilkur Former MPP)గా పని చేశారు. నారాయణరావు మృతి పట్ల సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI leader Narayana)తో పాలు పలువురు నాయకులు సంతాపం తెలిపారు.