ePaper
More
    HomeతెలంగాణPakistani Citizens | జిల్లాలోని పాకిస్థాన్​ పౌరులను పంపించేయండి

    Pakistani Citizens | జిల్లాలోని పాకిస్థాన్​ పౌరులను పంపించేయండి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Pakistani Citizens | జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్​ పౌరులను తక్షణమే పంపించేయాలని ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(MLAs Dhanpal Suryanarayana Gupta), రాకేష్ రెడ్డి(Rakesh Reddy) కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(Police Commissioner Sai Chaitanya)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్​ పౌరులను దేశం విడిచిపెట్టి పోవాలని కఠిన నిబంధనను విధించిందన్నారు.

    జిల్లాలో పాకిస్థాన్​ పౌరసత్వం, చెల్లుబాటు కానీ వీసాలతో నివసించే వారిని గుర్తించాలని కోరారు. గతంలో పాకిస్థాన్​ ఉగ్రవాద(Pakistan Terrorist) సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు జిల్లా కేంద్రంలో పట్టుబడ్డ విషయాన్ని సీపీ(CP)కి గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం లేదని, దీని మూలాన ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లే అవుతుందని పేర్కొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...