అక్షరటుడే, ఎల్లారెడ్డి: Semi-Christmas Celebrations | ఎల్లారెడ్డి పట్టణంలోని (Yellareddy town) స్థానిక సీఎస్ఐ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు (Semi-Christmas celebrations) నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ప్రెస్బెయిటర్ ఇన్ఛార్జి ఎర్రోళ్ల ప్రభాకర్ మాట్లాడుతూ.. క్రీస్తు జననం ప్రజలందరి జీవితాల్లో గొప్ప వెలుగును కలుగజేసిందన్నారు.

ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని తెలిపారు. అనంతరం చర్చిలో చిన్నారులు క్రీస్తు జననాన్ని వివరించే నాటికను ప్రదర్శించారు. అలాగే నృత్యాలు చేయడంతో పాటు ప్రత్యేక పాటలు పాడారు. తదనంతరం క్రిస్మస్ ఫీస్ట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంగీత ప్రభాకర్, సెక్రెటరీ జాకబ్, స్టువర్ట్ స్వామిదాస్, ట్రెజరర్ విజయ్, రేవ ప్రవీణ్, రేవ మాణిక్యం, రేవతి, సండే స్కూల్ సెక్రెటరీ థామ్సన్, సంఘ సభ్యులు, చిన్నారులు, తదితరులు, పాల్గొన్నారు.
