Homeబిజినెస్​Stock Market | ఐటీలో సెల్లాఫ్‌.. భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market | ఐటీలో సెల్లాఫ్‌.. భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ టెక్‌ దిగ్గజ సంస్థ అయిన టీసీఎస్‌(TCS) మొదటి త్రైమాసిన ఫలితాలు నిరుత్సాహ పరచడంతో ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. దీనికితోడు యూఎస్‌, భారత్‌ల మధ్య మినీ ట్రేడ్‌ డీల్‌పై అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతుండడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో స్టాక్‌ మార్కెట్లు(Stock markets) నష్టాలలో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రధాన సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 370 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కొంత కోలుకుని 220 పాయింట్లు పెరిగినా వెంటనే అమ్మకాల ఒత్తిడితో మరో 553 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి 67 పాయింట్లు పెరిగింది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి 173 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 620 పాయింట్ల నష్టంతో 82,570 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల నష్టంతో 25,175 వద్ద కొనసాగుతున్నాయి.

ట్రేడ్‌ డీల్‌(Trade deal) కుదుర్చుకోని దేశాలతో యూఎస్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. రోజుకు కొన్ని దేశాలపై అదనపు సుంకాలను విధిస్తోంది. ప్రధానంగా బ్రిక్స్‌ దేశాలపై అధిక సుంకాలు విధిస్తుండడం, భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Stock Market | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి

ఎఫ్‌ఎంసీజీ(FMCG) మినహా మిగతా అన్ని రంగాల స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఐటీ, టెలికాం స్టాక్స్‌ భారీగా పతనమవుతున్నాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.65 శాతం లాభాలతో కొనసాగుతోంది. ఐటీ ఇండెక్స్‌(IT index) 1.76 శాతం నష్టపోగా.. టెలికాం ఇండెక్స్‌ 1.41 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1.22 శాతం, ఎనర్జీ 1.21 శాతం, ఆటో సూచీ 1.20 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 0.68 శాతం, పీఎస్‌యూ(PSU) 0.65 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.62 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.76 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.72 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.71 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో 23 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌ 4.53 శాతం, ఆసియా పెయింట్‌ 0.70 శాతం, ఎన్టీపీసీ 0.57 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.56 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.53 శాతం లాభాలతో సాగుతున్నాయి.

Top Losers:టీసీఎస్‌ 2.70 శాతం, ఎంఅండ్‌ఎం 2.27 శాతం, ఎయిర్‌టెల్‌ 1.79 శాతం, రిలయన్స్‌ 1.69 శాతం, ఇన్ఫోసిస్‌ 1.63 శాతం నష్టాలతో ఉన్నాయి.

Must Read
Related News