ePaper
More
    Homeబిజినెస్​PRE MARKET ANALYSIS | ఆసియా మార్కెట్లలో సెల్లాఫ్‌.. ఫ్లాట్‌ టు గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న...

    PRE MARKET ANALYSIS | ఆసియా మార్కెట్లలో సెల్లాఫ్‌.. ఫ్లాట్‌ టు గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PRE MARKET ANALYSIS : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌, యూరోప్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. యూఎస్‌(US)కు చెందిన ఎస్‌అండ్‌పీ 0.70 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.52 శాతం లాభంతో ముగిశాయి. సోమవారం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.57 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.

    PRE MARKET ANALYSIS : లాభాల్లో యూరోప్‌ మార్కెట్లు

    యూరోప్‌(Europe) మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. యూకేకు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.59 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.42 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్‌(DAX) 0.3 శాతం లాభపడ్డాయి.

    PRE MARKET ANALYSIS : నెగెటివ్‌లో ఆసియా మార్కెట్లు..

    ప్రధాన ఆసియా(Asia) మార్కెట్లు సోమవారం సైతం నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 0.73 శాతం నష్టంతో ఉండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ 0.72 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హంగ్‌సెంగ్‌ 0.42 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.36 శాతం, సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.21 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.18 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) స్వల్ప నష్టాలతో ఉంది. 0.07 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు స్లైట్‌ నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    PRE MARKET ANALYSIS : గమనించాల్సిన అంశాలు..

    • గత ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లో సంస్థాగత మదుపరులు మన మార్కెట్లలో భారీ మొత్తంలో స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 8,831 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. డీఐఐలు నికరంగా రూ. 5,187 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర స్వల్పంగా పెరిగింది. బ్యారెల్‌కు 0.07 శాతం పెరిగి 62.53 డాలర్లకు చేరింది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలహీనపడి 85.51 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.11 శాతం పెరిగి 4.49 వద్ద ఉంది. యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.06 శాతం పడిపోయి 100.76 వద్ద నిలిచింది.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.97 శాతం తగ్గి నుంచి 1.19 వద్ద ఉంది. విక్స్‌(VIX) వరుసగా ఐదో సెషన్‌లోనూ తగ్గింది. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో 2.03 శాతం తగ్గి, 16.55 వద్ద ఉంది. విక్స్‌ తగ్గడం బుల్స్‌కు అనుకూలాంశం.

    Latest articles

    Medical College | మెడికల్​ కళాశాల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో.33ను అమలు చేయాలని...

    Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    More like this

    Medical College | మెడికల్​ కళాశాల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో.33ను అమలు చేయాలని...

    Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...