అక్షరటుడే, వెబ్‌డెస్క్: IT Sector | ప్రముఖ ఏఐ సంస్థ యాంథ్రోపిక్.. డాక్యుమెంట్ రివ్యూస్, డాటా అనాలసిస్ చేయగల కొత్త ఏఐ టూల్స్ తీసుకువచ్చింది. దీంతో ఆయా సేవలు అందించే భారతీయ ఐటీ కంపెనీలు (Indian IT Companies) తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా (Tech Mahindra), టీసీఎస్ కంపెనీలు ఆరు శాతానికిపైగా నష్టపోయాయి. ఐటీ రంగంలో సెల్లాఫ్ ప్రభావం ప్రధాన సూచీలపై కనిపిస్తోంది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 487 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 133 పాయింట్లు పడిపోయింది.
కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో అక్కడినుంచి 766 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 52 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 112 పాయింట్లు దిగజారింది. అయితే ఇంట్రాడే కనిష్టాలనుంచి కోలుకుని 238 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 133 పాయింట్ల నష్టంతో 83,605 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 25,716 వద్ద ఉన్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ రాణిస్తుండగా.. లార్జ్ క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఐటీలో సెల్లాఫ్..
బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 6 శాతానికిపైగా నష్టపోయింది. డిఫెన్స్, హెల్త్‌కేర్, సర్వీసెస్ ఇండెక్స్‌లు నష్టాలతో సాగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఇన్ఫ్రా, కన్జూమర్ డ్యూరెబుల్, ఎనర్జీ, ఆటో, పీఎస్‌యూ, యుటిలిటీ, మెటల్ ఇండెక్స్‌లో లాభాల బాటలో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.67 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.99 శాతం లాభంతో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 10 స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 2.77 శాతం, పవర్‌గ్రిడ్ 2.59 శాతం, ఎటర్నల్ 2.36 శాతం, ఎన్టీపీసీ 2.06 శాతం, టైటాన్ 1.77 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 8.21 శాతం, టీసీఎస్ 6.60 శాతం, టెక్ మహీంద్రా 6.39 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 5.67 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.78 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.