అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | రష్యానుంచి చమురు కొనుగోళ్లను ఆపకపోతే సుంకాలను పెంచుతామన్న అమెరికా అధ్యక్షుడి (US President) హెచ్చరికల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) ఒడిదుడుకులకు లోనవుతోంది. దీని ప్రభావంతో వరుసగా రెండో రోజూ మన మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 324 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో పుంజుకుని 390 పాయింట్లు ఎగబాకింది.
నిఫ్టీ 61 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 45 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 129 పాయింట్లు పెరిగింది. అయితే ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు మళ్లీ పతనమయ్యాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 368 పాయింట్ల నష్టంతో 85,071 వద్ద, నిఫ్టీ (Nifty) 77 పాయింట్ల నష్టంతో 26,172 వద్ద ఉన్నాయి.
ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాలు..
రిలయన్స్ సంస్థ రష్యానుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందంటూ బ్లూమ్‌బర్గ్‌లో ప్రచురితమైన కథనంతో ఆ కంపెనీపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అది తప్పుడు కథనమని రిలయన్స్ చెబుతున్నా షేరు ధర నాలుగున్నర శాతానికిపైగా క్షీణించింది. బిజినెస్ అప్‌డేట్స్ ఆశించినట్లుగా లేకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ఒకటిన్నర శాతానికిపైగా నష్టపోయింది. ట్రెంట్, టాటామోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ స్టాక్స్ సైతం ప్రధాన సూచీలను కిందికి లాగుతున్నాయి.
ఆయిల్, ఎనర్జీ సెక్టార్లలో సెల్లాఫ్..
బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 0.91 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.80 శాతం, హెల్త్‌కేర్ 0.71 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.69 శాతం, ఐటీ ఇండెక్స్ 0.51 శాతం లాభాలతో ఉన్నాయి. ఎనర్జీ ఇండెక్స్ 2.11 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.08 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.47 శాతం, సర్వీసెస్ 0.47 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.43 శాతం, యుటిలిటీ 0.40 శాతం, పవర్ 0.35 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.35 శాతం నష్టంతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.11 శాతం లాభంతో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 2.73 శాఆతం, ఎస్‌బీఐ 1.01 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.93 శాతం, సన్‌ఫార్మా 0.71 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.62 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ట్రెంట్ 7.60 శాతం, రిలయన్స్ 4.62 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.69 శాతం, ఇండిగో 1.16 శాతం, పవర్‌గ్రిడ్ 1.05 శాతం నష్టాలతో ఉన్నాయి.