HomeతెలంగాణVikarabad | పీచు మిఠాయి మాటున గంజాయి చాక్లెట్ల విక్రయం

Vikarabad | పీచు మిఠాయి మాటున గంజాయి చాక్లెట్ల విక్రయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vikarabad | రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. నగరాల నుంచి మొదలు పెడితే గ్రామాల వరకు గంజాయి విరివిగా దొరుకుతోంది. దీంతో చాలా మంది దీనికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీ విద్యార్థులే(College Students) లక్ష్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా పీచుమిఠాయి మాటున గంజాయి విక్రయాలు జరుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

వికారాబాద్(Vikarabad) జిల్లా తాండూరు పట్టణం(Tandoor Town)లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్​(Uttar Pradesh)కు చెందిన కొందరు పీచుమిఠాయి మాటున రహస్యంగా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేశారు. పీచు మిఠాయి(Peach Candy)తో పాటు రహస్యంగా గంజాయి అమ్ముతున్న యూపీకి చెందిన దినేశ్​ నాయక్​ను అరెస్ట్​ చేశారు. అతని వద్ద 45 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకు వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దినేశ్​ నాయక్​ దొరకడంతో మరికొందరు పరార్​ అయినట్లు తెలుస్తోంది.

Vikarabad | తల్లిదండ్రుల్లో ఆందోళన

పీచు మిఠాయిని ఎక్కువగా చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. అయితే పీచుమిఠాయి పేరిట కొందరు గంజాయి చాక్లెట్లు అమ్మడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆ చాక్లెట్లు పిల్లలకు అలవాటు చేస్తే వారి జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

Vikarabad | విస్తరిస్తున్న గంజాయి మాఫియా

రాష్ట్రంలో గంజాయి మాఫియా విస్తరిస్తోంది. చిన్న చిన్న దుకాణాలు, పాన్​ డబ్బాలు, ఐస్​ క్రీం డబ్బాల ముసుగులో గంజాయి విక్రయాలు జరుపుతున్నారు. గంజాయి, డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపుతామని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. అయినా గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు సాగుతున్నాయి. ఎంతో మంది దీనికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.