person selling fake paneer in Gorakhpur
Gorakhpur | కల్తీ ఫనీర్​ విక్రయం.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gorakhpur | ప్రస్తుత రోజుల్లో ప్రతి వస్తువును కల్తీ(Adulteration) చేస్తున్నారు. వస్తువులతో మొదలు పెడితే ఆహార పదార్థాల వరకు ప్రతీది కల్తీ అవుతోంది.

ముఖ్యంగా ఆహార పదార్థాల కల్తీతో food adulteration ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh Police)​ పోలీసులు కల్తీ పన్నీర్ (Paneer)​ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు. కల్తీ పన్నీర్​తో నిందితుడు నెలకు పెద్దమొత్తంలో సంపాదిస్తున్నట్లు గుర్తించారు. నెలనెలా ఏకంగా రూ.42 లక్షలు సంపాదిస్తున్నట్లు గుర్తించి పోలీసులే విస్తుపోయారు.

ఉత్తరప్రదేశ్​లోని గోరక్​పూర్ (Gorakhpur)​కు చెందిన ఖలీద్​ కల్తీ పన్నీర్​ విక్రయిస్తున్నాడు. దీనికోసం 25 లీటర్ల పాడైపోయిన పాలను నిందితుడు వినియోగిస్తున్నాడు. అంతేగాకుండా డిటర్జెంట్, ఫాబ్రిక్ వైట్‌నర్, సోయాబీన్స్, పోస్టర్ కలర్, పామాయిల్, లాండ్రీ సబ్బు, సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 25 లీటర్ల పాలతో 40 క్వింటాళ్ల కల్తీ పన్నీర్​ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిని విక్రయించి ప్రతి నెల రూ.42 లక్షలు సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్​ చేశారు.