ePaper
More
    Homeబిజినెస్​LIC | అక్కడ అమ్మి.. ఇక్కడ పెట్టుబడి.. పోర్ట్‌పోలియోలో మార్పులు చేసిన ఎల్‌ఐసీ

    LIC | అక్కడ అమ్మి.. ఇక్కడ పెట్టుబడి.. పోర్ట్‌పోలియోలో మార్పులు చేసిన ఎల్‌ఐసీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC | అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు(DII) అయిన ఎల్‌ఐసీ(LIC) మార్చితో ముగిసిన త్రైమాసికంలో తన పోర్ట్‌పోలియోలో పలు మార్పులు చేసింది. కొన్ని కంపెనీలలో పెట్టుబడులు ఉపసంహరించుకున్న ఎల్‌ఐసీ.. కొన్ని కొత్త స్టాక్స్‌ను తన పోర్ట్‌పోలియో(Portfolio)లో యాడ్ చేసుకుంది. మరికొన్నింటిలో వాటా పెంచుకుంది. ఎల్ఐసీ దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో (domestic stock market) 351 కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. ఇందులో నాలుగో క్వార్టర్‌లో 105 స్టాక్స్‌(Stocks)లో వాటాను పెంచుకున్న ఎల్‌ఐసీ.. 86 స్టాక్స్‌లో వాటాను తగ్గించుకుంది. కాగా మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా మార్చి త్రైమాసికంలో ఎల్‌ఐసీ పోర్ట్ పోలియో విలువ (LIC portfolio values) 0.73 శాతం తగ్గి రూ. 15.18 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు క్వార్టర్‌లో ఇది రూ. 15.88 లక్షల కోట్లుగా ఉండేది.

    LIC | ‘హీరో’లో అత్యధికంగా పెట్టుబడులు

    మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero motocorp)లో గణనీయంగా వాటా పెంచుకుంది. నాలుగో క్వార్టర్‌లో రూ. 4,968 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయడం ద్వారా తన వాటాను 5.53 శాతంనుంచి 11.84 శాతానికి పెంచుకుంది. ఆ తర్వాతి స్థానంలో రిలయన్స్‌ ఉంది. రిలయన్స్‌ (Reliance) ఇండస్ట్రీస్‌లో రూ. 3,675 కోట్లు ఇన్వెస్ట్ (invest) చేసి వాటాను 6.74 శాతానికి పెంచుకుంది. దీనితో పాటు ఎల్‌టీ(LT)లో రూ. 2,975 కోట్లు, ఏషియన్ పెయింట్స్‌లో రూ. 2,466 కోట్లు, హెచ్యూఎల్ లో రూ. 2,361 కోట్లు, బజాజ్ ఆటోలో రూ. 1,983 కోట్లు పెట్టుబడి పెట్టింది.

    ఎస్‌బీఐ(SBI)లో రూ. 1,652 కోట్లు, పతంజలి ఫుడ్స్‌లో (patanjali foods) రూ. 1,638 కోట్లు, టాటా మోటార్స్‌లో (tata motors) రూ. 1,578 కోట్లు, మారుతిలో రూ. 1,493 కోట్లు, హెచ్‌సీఎల్‌ టెక్‌లో రూ. 1,441 కోట్లు, ఐజీఎల్‌లో రూ. 1,333 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.

    ఐఆర్‌ఎఫ్‌సీ(IRFC)లో రూ. 1,815 కోట్లతో 1.05 వాటా కొనుగోలు చేసింది. జిందాల్‌ స్టేయిన్‌లెస్‌లో (jindal stainless) వాటా 1.24 శాతానికి, కేపీఐటీలో 1.32 శాతానికి వాటాను పెంచుకుంది. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బీఎల్‌ఎస్‌ ఇంటర్‌నేషనల్‌, జేటీఎల్‌ (JTL), ఎన్విరో ఇన్‌ఫ్రా, అవలాన్‌ టెక్నాలజీస్‌, జై కార్ప్‌, బాంబే డైయింగ్‌లలో వాటా పెంచుకుంది. ఐటీసీ డీమెర్జర్‌ ద్వారా ఐటీసీ హోటల్స్‌ (ITC Hotels)లో రూ.3,325 కోట్ల విలువైన షేర్లు లభించాయి. తద్వారా ఆ కంపెనీలో ఎల్‌ఐసీ వాటా 9.22 శాతానికి చేరింది

    LIC | ఐసీఐసీఐ నుంచి రూ. 2 వేల కోట్ల ఉపసంహరణ..

    ఎల్‌ఐసీ గత త్రైమాసికంలో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) షేర్లను అమ్మేసింది. రూ. 1,987 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించడం ద్వారా వాటాను 7.14 శాతంనుంచి 6.8 శాతానికి తగ్గించుకుంది. ఇన్ఫోసిస్‌లో రూ. 1,652 కోట్లు, టీసీఎస్‌లో రూ, 1625 కోట్లు, విప్రోలో రూ. 1,234 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించింది. బజాజ్(Bajaj) ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ స్టాక్స్‌లోనూ వాటా తగ్గించుకుంది.
    అబాన్‌ ఆఫ్‌షోర్స్‌, బిన్నీ మిల్స్‌, గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, కావేరి సీడ్స్‌, మాక్రోటెక్‌ డెవలపర్స్‌, పారాదీప్‌ పాస్పేట్స్‌, పిరమల్‌ ఫార్మా, రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ (relaince home finance), Divgi Torqtransfer Systems, సూరజ్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌, ఎస్‌వీ గ్లోబల్‌ మిల్‌, టెక్స్‌మాకో రైల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, యూకెన్‌ ఇండియా కంపెనీలలో వాటాను దాదాపు పూర్తిగా విక్రయించడమో.. గణనీయంగా తగ్గించుకోవడమో చేసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...