Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | యువకుడి సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం

Nizamabad City | యువకుడి సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం

గడ్డి మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ నగరంలో (Nizamabad City) చోటుచేసుకుంది. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఆ సెల్ఫీ వీడియోలో (selfie video) ఆవేదన వ్యక్తం చేశాడు.

అమ్మాయి తరపు బంధువులు తనపై అక్రమంగా కేసులు పెట్టి (illegally filing cases) వేధిస్తున్నారని తన సూసైడ్​కు వారే కారణమని ఆరోపించాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అనంతరం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గణేష్ పరిస్థితి విషమంగా ఉంది.

Must Read
Related News