అక్షరటుడే, కమ్మర్పల్లి/ఆర్మూర్ : Sports Competitions | జిల్లాస్థాయిలో కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రతినిధులు శుక్రవారం వివరాలు వెల్లడించారు.
Sports Competitions | కబడ్డీ పోటీలకు..
కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Choutpally ZPH School) విద్యార్థి జాన్‌పాల్ నాయక్ అండర్–17 జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీ (State Level Kabaddi Competition)లకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నగేష్ తెలిపారు. ముప్కాల్‌లో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయికి ఎంపికయ్యాడని వెల్లడించారు. అలాగే బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 8 నుండి 10 వరకు భద్రాచలం కొత్తగూడెంలో 69 వ రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని జాన్‌పాల్ నాయక్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఆంధ్రయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
Sports Competitions | బీచ్ వాలీబాల్‌కు క్రీడాకారుల ఎంపిక
బీచ్ వాలీబాల్ (Beach Volleyball)కు ఆర్మూర్ మండలం మగ్గిడి ఉన్నత పాఠశాల క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ మధుసూదన్ తెలిపారు. ఈనెల 4న జక్రాన్‌పల్లి మండలంలోని కలిగోట్‌లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) బీచ్ వాలీబాల్-17 టోర్నమెంట్లో మొదటి స్థానం సంపాదించిన తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను హెచ్ఎం హరిత, ఉపాధ్యాయులు, గ్రామ వీడీసీ సభ్యులు అభినందించారు. ఈ క్రీడాకారులు ఈ నెలలో ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో పాల్గొననున్నారని పీడీ వెల్లడించారు.
![]()
