అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kho Kho competitions | కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాలలో గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (joint Nizamabad district) స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. పురుషులు, మహిళల సీనియర్ విభాగంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సుమారు 328 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పురుషులు, 20 మంది మహిళా క్రీడాకారులను ఎంపిక చేశారు.
ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 25 నుంచి నవంబర్ 5 వరకు పిట్లం జెడ్పీ హైస్కూల్లో (Pitlam ZP High School) జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొంటారన్నారు. నవంబర్ 6 నుంచి 9 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఛైర్మన్ బిల్లా అనిల్, అధ్యక్షుడు జీవీ భూమా రెడ్డి, ప్రధాన కార్యదర్శి అతీఫుల్లా, కోశాధికారి మధుసూదన్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేశ్వరావు, ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, అనిల్ కుమార్, సెక్రెటరీ సుజాత, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
