అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ (Telangana State Formation Day) సందర్భంగా ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారాలకు జిల్లా పోలీసు అధికారులు (district police officers), సిబ్బందిని ఎంపిక చేసింది. జిల్లా నుంచి కామారెడ్డి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్(Kamareddy AR Head Constable)తో పాటు సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, భిక్కనూర్ ఎస్సై దత్తాత్రి గౌడ్, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి ఏఎస్సైలు సుబ్రమణ్య చారి, ఏ శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, ఏఆర్ ఎస్సై సత్యనారాయణ రెడ్డి, బిచ్కుంద ఏఎస్సై శంకర్, కామారెడ్డి, రామరెడ్డి, గాంధారి హెడ్ కానిస్టేబుల్ నారాయణ, కృష్ణమూర్తి, రవికుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్యం గౌడ్, కామారెడ్డి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ కిషన్, కామారెడ్డి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు, కామారెడ్డి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ తోపాటు పలువురు కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు. ఈ మేరకు వారికి ఎస్పీ రాజేష్ చంద్ర అభినందనలు తెలిపారు.
