అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy Town | పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, జిల్లా అబ్జర్వర్ రాజ్‌పాల్ కరోల (observer Rajpal Karola) అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని (Yellareddy town) స్నేహ బాంకెట్ హాల్లో బుధవారం డీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావుతో (MLA Madan Mohan Rao) కలిసి నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు.
వారందరి నుంచి వ్యక్తిగతంగా లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. అభిప్రాయ సేకరణ తర్వాత నివేదిక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు మల్లికార్జున్, ఎల్లారెడ్డి ఏఎంసీ ఛైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, గాంధారి ఏఎంసీ ఛైర్మన్ బండారి పరమేష్, ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.