ePaper
More
    HomeసినిమాShekhar Kammula | నాని-శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లు కానుంది.. ఇదిగో క్లారిటీ..!

    Shekhar Kammula | నాని-శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లు కానుంది.. ఇదిగో క్లారిటీ..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Shekhar Kammula | జూన్ 20న శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కుబేర (Kubera) చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి గ‌త కొద్ది రోజ‌లుగా జోరుగా ప్రమోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా శేఖ‌ర్ క‌మ్ముల ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. నాని – శేఖర్ కమ్ముల కాంబినేషన్(Nani – Shekhar Kammula combination)లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న సంగతి సినీవర్గాలకు తెలిసిందే. కొంతకాలంగా ఈ కాంబోపై వార్తలు వస్తున్నప్పటికీ, ప్రాజెక్ట్ మొదలయ్యే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఇంకా టైమ్ పట్టేలా కనిపిస్తోంది.

    Shekhar Kammula | వెయిటింగ్..

    తాజాగా శేఖ‌ర్ క‌మ్ముల ఈ ప్రాజ‌క్ట్ గురించి స్పందిస్తూ.. ప్ర‌స్తుతం ఇది తొలి ద‌శ‌లోనే ఉంద‌ని, ప్ర‌స్తుతం డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. ఒక్క‌సారి స్క్రిప్ట్ లాక్ అయితే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తానని చెప్పుకొచ్చారు శేఖర్ క‌మ్ముల‌. దీంతో నాని- శేఖ‌ర్ క‌మ్ముల సినిమాకు సంబంధించి ఎప్పుడు పూర్తి క్లారిటీ ఇస్తారా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ‘దసరా’ ‘హాయ్ నాన్న’ ‘సరిపోదా శనివారం’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్​లో ఉన్నారు నాని. ప్రస్తుతం ‘హిట్ 3: థర్డ్ కేస్’ మూవీలో నటించారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన సుజీత్ ప్రాజెక్ట్ సెట్స్(Sujeeth project sets) మీదకు వెళ్లాల్సి ఉంది. తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో ఓ సినిమా చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

    నానికి (Nani) ఇప్పటికే 2026కి సంబంధించి రెండు ప్రాజెక్టులు లైన్​లో ఉన్నాయి. దీంతో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కోసం ఒకేసారి ఎక్కువ డేట్స్ ఇవ్వడం కష్టమని, ప్రతినెలా పదిరోజుల చొప్పున డేట్స్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా షూటింగ్​కు టైమ్ పట్టే అవకాశం ఉంది. అయినా, ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి పద్ధతిలోనైనా సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆసియన్ సునీల్ నిర్మించబోతున్నాడు. ‘లవ్ స్టోరీ’, ‘ఫిదా’ తరహాలో శేఖర్ కమ్ముల తన స్టైల్​లో తీసే సెన్సిబుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. అందుకే నిర్మాణంలో ఖర్చుకు వెనుకాడకుండా మంచి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమా తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఉన్నారని సమాచారం.

    More like this

    PM Narendra Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను స్వాగ‌తించిన ప్ర‌ధాని మోదీ.. అమెరికాతో వ్యూహాత్మ‌క సంబంధాలున్నాయ‌ని వ్యాఖ్య‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: PM Narendra Modi | భార‌త్‌-అమెరికా మ‌ధ్య వాణిజ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న త‌రుణంలో కీల‌క...

    US President Trump | భార‌త్‌తో సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు సిద్ధం.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: US President Trump | వాణిజ్య యుద్ధంతో భార‌త్‌, అమెరికా మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్న...

    Donald Trump | ప్ర‌పంచ పెద్ద‌న్న‌ను స‌వాల్ చేస్తున్న భార‌త్‌.. పున‌రాలోచ‌న‌లో ప‌డిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Donald Trump | భార‌త్ దూసుకుపోతోంది. అనేక స‌వాళ్లు, సంక్షోభాల న‌డుమ జోరు కొన‌సాగిస్తోంది....