Indalwai
Indalwai | ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల సీజ్​

అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్​ చేసినట్లు ఎస్సై సందీప్ (SI sandeep)​ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారనే సమాచారంతో లోలం వాగులో (Lolam Vagu) తనిఖీలు చేశామన్నారు. అక్కడ ఇసుకను లోడ్​ చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను గుర్తించామన్నారు. వారి వద్ద ఎలాంటి అనుమతులు లేకపోవడంతో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ట్రాక్టర్లను సీజ్​ చేసినట్లు తెలిపారు.