HomeతెలంగాణNizamabad | అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల పట్టివేత

Nizamabad | అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల పట్టివేత

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ :Nizamabad | మహారాష్ట్ర(Maharashtra) నుంచి నగరానికి అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లను(Cigarettes) పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి ​నగరంలోని మూడో టౌన్​ పోలీస్​ స్టేషన్​(3 Town Police Station) పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి జీఎస్​టీ చెల్లించకుండా అక్రమంగా నగరానికి తీసుకు వస్తున్న సిగరెట్లను పట్టుకున్నారు. వీటి విలువ సూమరు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అనంతరం కమర్షియల్​ ట్యాక్స్​ అధికారులకు(commercial tax officers) అప్పగించారు. కాగా.. నిజామాబాద్​కు నగరానికి చెందిన ఇద్దరు మార్వాడీ వ్యాపారులు మహారాష్ట్ర నుంచి తక్కువ రేట్లకు సిగరెట్లు తీసుకు వస్తున్నట్లు తెలిసింది. వీరు అక్కడి నుంచి తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.