HomeతెలంగాణIncharge Minister | జూపల్లి ఔట్.. సీతక్కకు ఉమ్మడి జిల్లా బాధ్యతలు

Incharge Minister | జూపల్లి ఔట్.. సీతక్కకు ఉమ్మడి జిల్లా బాధ్యతలు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Incharge minister | సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఇంఛార్జి మంత్రిగా సీతక్కకు బాధ్యతలు అప్పగించారు.

ఇదివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కాగా.. ఆయన పనితీరు బాగాలేదని సొంత పార్టీకి చెందిన జిల్లా నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ప్రత్యేకించి నియోజకవర్గ ఇంచార్జీలకు పెద్దపీట వేస్తున్నారని, అక్రమాలకు పాల్పడే వారికి సహకరిస్తున్నారని హైకమాండ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన్ను ఈ బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం అప్పట్లోనే జోరుగా సాగింది.

Incharge minister | మంత్రివర్గ విస్తరణతో..

ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించారు. ఇదే సమయంలో వారికి శాఖలతో పాటు పలు జిల్లాల బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో నిజామాబాద్ జిల్లా ఇంచార్జి బాధ్యతల నుంచి జూపల్లి కృష్ణారావును తప్పించారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను నియమించింది.