Homeజిల్లాలునిజామాబాద్​Seeds Corporation | ప్రతి డీలర్ విత్తనాభివృద్ది సంస్థ విత్తనాలు అమ్మాల్సిందే

Seeds Corporation | ప్రతి డీలర్ విత్తనాభివృద్ది సంస్థ విత్తనాలు అమ్మాల్సిందే

ఉమ్మడి జిల్లాలో ప్రతి డీలర్ విత్తనాభివృద్ది సంస్థ విత్తనాలను అమ్మాల్సిందేనని సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్​ కలెక్టరేట్​లో ​విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Seeds Corporation | ఉమ్మడి జిల్లాలో విత్తనాభివృద్ది సంస్థ విత్తనాలు ప్రతి డీలర్​ అమ్మాల్సిందేనని విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి (Chairman Anvesh Reddy) స్పష్టం చేశారు. నిజామాబాద్​ కలెక్టరేట్​లో (Nizamabad Collectorate) ప్రైవేట్​ విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్​ కంపెనీలు (private companies) ఆకర్షణీయమైన ప్రకటనలతో మోసపూరిత మాటలతో రైతులను మోసం చేయవద్దని సూచించారు.

Seeds Corporation | రైతులను ఆదుకుంటాం

ప్రభుత్వం అన్నిరకాలుగా రైతులను ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ధాన్యానికి ఏ ప్రభుత్వంలో లేనివిధంగా రూ.500 బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఇస్తోందన్నారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటే విత్తనాల్లో మాత్రం ప్రైవేట్​ కంపెనీల అజమాయిషీ పెరిగి రైతులకు నష్టం జరుగుతోందన్నారు. రైతులకు నష్టం జరగకుండా మంచి విత్తనాలను రైతులకు అందించాల్సిన బాధ్యత ప్రైవేట్ డీలర్లపై (private dealers) ఉందన్నారు. విత్తనాభివృద్ధి సంస్థకు, రైతులకు మధ్య ప్రైవేట్ డీలర్లు వారధిగా ఉండాలన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ రైతుల కోసం నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.

Seeds Corporation | ఉమ్మడి జిల్లాలో

ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ డీలర్ విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించి 20 క్వింటాళ్ల విత్తనాలు అమ్మాలని సూచించారు. ‘‘మా సంస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లని’’ ఆయన ప్రైవేట్​ డీలర్లతో అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా డీలర్లు, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, భీమ్​గల్ ఏడీఏ సాయికృష్ణ, టీజీఎస్​డీసీ మార్కెటింగ్ మేనేజర్ రాజీవ్, ఆర్​ఎం రఘు, అధికారులు పాల్గొన్నారు.