అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చెప్పేందుకు కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్లు నిర్మాణం చేపడుతోంది.
ఈ క్రమంలో జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లో (Secunderabad) దేశంలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. ఇది పరేడ్ గ్రౌండ్ (సికింద్రాబాద్) నుంచి శామీర్‌పేట వరకు ఉండబోతుంది. మొత్తం 18.170 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జి (Steel Bridge) నిర్మించనున్నారు. అందులో 11.65 కిలోమీటర్ల వంతెనను పూర్తిగా స్టీల్‌తో నిర్మించనున్నారు. ఇది దేశంలోనే అతి పొడవైన స్టీల్ వంతెన అవుతుంది.
ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలివే..
- ప్రాజెక్టు మొత్తం వ్యయం: రూ. 2,232 కోట్లు
- ప్రాజెక్టు పొడవు: 18.170 కిలోమీటర్లు
- స్టీల్ వంతెన భాగం: 11.65 కిలోమీటర్లు
- నిర్మాణ పద్ధతి: EPP (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్)
- నిర్మాణానికి తక్కువ సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు
- పునాదులు కాంక్రీట్‌తో, వంతెన భాగం పూర్తిగా స్టీల్‌తో నిర్మించనున్నారు
- హకీంపేట దగ్గర 450 మీటర్ల టన్నెల్ కూడా నిర్మించనున్నారు
- మిగిలిన 6 కిలోమీటర్ల రోడ్డు భాగాన్ని 6 లైన్లతో విస్తరించనున్నారు
ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ (Hyderabad) వాసులకు పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా ప్రయోజనం కలిగేలా ఉంటుంది. ట్రాఫిక్ నుంచి భారీగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానిస్తోంది. త్వరలోనే నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
2 comments
[…] అయింది. ఈ సీజన్లో హైదరాబాద్(Hyderabad) నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీలో […]
[…] వారు శనివారం ఉదయం హైదరాబాద్(Hyderabad)కు చేరుకున్నారు. వారం రోజుల పాటు వారు […]
Comments are closed.