అక్షరటుడే, ఆర్మూర్ : Talla Rampur | ఏర్గట్ల (Ergatla) మండలం తాళ్లరాంపూర్ గ్రామాలో ఈ నెల 21 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.
గ్రామంలో ఇటీవల వీడీసీ (VDC), గౌడ కులస్తుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈత చెట్లను నరికివేయడంతో గొడవ మొదలైంది. దీంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు
ఎలాంటి గొడవలు జరగకుండా 144 సెక్షన్ (144 Section) అమలు చేస్తున్నారు. గ్రామంలో సభలు, సమావేశాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టొద్దని పోలీసులు హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, గుమిగూడి ఉండడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గ్రామంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు.