ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Excise Police | బోకర్​ నుంచి గుట్టుగా గంజాయి రవాణా.. ఒకరి అరెస్ట్​

    Excise Police | బోకర్​ నుంచి గుట్టుగా గంజాయి రవాణా.. ఒకరి అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Police | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని (Maharashtra) బోకర్​ నుంచి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఎక్సైజ్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ (Excise Enforcement)​ డిప్యూటీ డైరెక్టర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్​ఫోర్స్​మెంట్​ సీఐ వెంకట్​ (CI venkat) నగరంలోని అమన్​నగర్​, ఖిల్లారోడ్​లో తనిఖీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా పక్కా సమాచారం మేరకు నగరానికి చెందిన షేక్ మిరాజ్​ను అదుపులోకి తీసుకున్నారు.

    బైక్​పై రవాణా చేస్తున్న 6.5 కేజీల ఎండు గంజాయిని తీసుకెళ్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంజాయి, బైక్​ను సీజ్​ చేశారు. సదరు వ్యక్తి మహారాష్ట్రలోని బోకర్​లో (Boker) నివాసముండే ఫారుఖ్ ఖురేషి నుండి గంజాయిని కొనుగోలు చేసి నగరంలో అమ్మేందుకు తీసుకొచ్చినట్లు ఎక్సైజ్​ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...