అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Secretariat | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పని చేసే ఉద్యోగులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త ఐడీ కార్డులను (ID cards with QR codes) అందించనుంది.
రాష్ట్రంలో సచివాలయం కీలకమైంది. ఇక్కడ ఎంతో భద్రత ఉంటుంది. అయితే సచివాలయంలో గతంలో కొందరు నకిలీ ఉద్యోగులు ఎంటర్ అవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఫేక్ ఐడీకార్డులతో పలువురు సచివాలయ ఉద్యోగులుగా (Secretariat employees) ప్రవేశించారు. పలువురు ప్రైవేట్ వ్యక్తులు మార్ఫింగ్ ఐడీ కార్డులతో సెక్రటరియట్‌లో హంగామా చేశారు. సెల్ఫీలు దిగారు. దీనిపై గతంలో వార్తలు వెలువడటంతో భద్రతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది.
Telangana Secretariat | కొత్త కార్డుల పంపిణీ
సచివాలయంలో (Telangana Secretariat) పని చేసే సిబ్బందికి గురువారం నుంచి కొత్త ఐడీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. మార్ఫింగ్ చేయడానికి వీలు లేకుండా అత్యాధునికి సాంకేతికతను వినియోగించి క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు అందిస్తున్నారు. దీంతో నకిలీ కార్డులను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త కార్డుల్లో ఉద్యోగి ఫొటో, ఐడీ నంబర్‌తో పాటు క్యూఆర్ కోడ్ ఉంటాయి. సచివాలయ భద్రతా సిబ్బంది ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఉద్యోగికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దీంతో నకిలీ కార్డులు తయారు చేయడం కష్టం, ఒకవేళ చేసినా.. చెకింగ్ సమయంలో దొరికిపోతారు. ఈ కార్డులో చిప్‌ను కూడా అమర్చారు.
Telangana Secretariat | తొలిదశలో..
సచివాయంలో అనేక మంది ఉద్యోగులు పని చేస్తారు. అయితే తొలిదశలో రెగ్యులర్ ఉద్యోగులు 1300 మందికి, నాలుగో తరగతి సిబ్బంది 300 మందికి కొత్త ఐడీకార్డులు ఇస్తున్నారు. మిగిలిన వారికి త్వరలో అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఐడీ కార్డులతో సచివాలయ భద్రత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ కార్డులతో లోనికి ప్రవేశించే వారికి చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు.