Homeతాజావార్తలుHyderabad | బాత్​రూమ్​లో సీక్రెట్​ కెమెరాలు.. ఇంటి యజమాని అరెస్ట్

Hyderabad | బాత్​రూమ్​లో సీక్రెట్​ కెమెరాలు.. ఇంటి యజమాని అరెస్ట్

హైదరాబాద్​ నగరంలోని మధురానగర్​లో ఓ వ్యక్తి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి బాత్​రూమ్​లో సీక్రెట్​ కెమెరా ఏర్పాటు చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అద్దెకు ఉంటున్న వారి ఇంటి బాత్​రూమ్​లో ఓ వ్యక్తి సీక్రెట్​ కెమెరా ఏర్పాటు చేశాడు. హైదరాబాద్​ నగరంలోని మధురానగర్​లో (Madhuranagar)​ ఈ ఘటన వెలుగు చూసింది.

హైదరాబాద్​ (Hyderabad) నగరానికి చదువు, ఉద్యోగాల కోసం లక్షలాది మంది వలస వస్తారు. చాలా మంది కుటుంబాలతో కలిసి అద్దె ఇళ్లలో నివాసం ఉంటారు. అలాంటి వారికి షాకింగ్​ న్యూస్​ ఇది. ఓ యజమాని అద్దెకు ఉంటున్న వారి ఇంటి బాత్​రూమ్​లో సీక్రెట్​ కెమెరా (Secret Camera) ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో మంది పొట్ట చేతపట్టుకొని నగరంలో బతుకుతున్నారు. అలాంటి వారు ఈ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Hyderabad | బల్బ్​ పాడవడంతో..

మధురానగర్​ పరిధిలోని జవహర్​ నగర్​లో (Jawahar Nagar)​ ఓ జంట అద్దెకు ఉంటున్నారు. అయితే వారి బాత్​రూమ్​లో బల్బ్​ పని చేయలేదు. ఈ విషయాన్ని ఓనర్ అశోక్​కు తెలపగా.. అక్టోబర్​ 4న ఎలక్ట్రీషియన్​ చింటు సాయంతో కొత్త హోల్డర్​ ఏర్పాటు చేయించాడు. అదే సమయంలో ఇద్దరు కలిసి బల్బ్​ హోల్డర్​లో సీక్రెట్​ కెమెరా పెట్టారు. ఈ విషయాన్ని ఆ దంపతులు ఈ నెల 13న గుర్తించారు. అనంతరం యజమానికి చెప్పగా.. ఎలక్ట్రీషియన్​ చింటూ ఏర్పాటు చేసి ఉంటాడని, అతడు మంచి వాడు కాదని వారిని బెదిరించాడు.

Hyderabad | నిందితుడి అరెస్ట్​..

ఈ విషయం బయటకు చెబితే చింటూ దాడి చేస్తాడని చెప్పారు. దీంతో ఆ దంపతులు ఇంటి యజమాని అశోక్​తో పాటు, ఎలక్ట్రీషియన్​ చింటూపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి యజమాని అశోక్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఎలక్ట్రీషియన్​ చింటూ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నారు.