అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు ఈ నెల 14న జరుగనున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ డివిజన్లోని (Nizamabad division) 7 మండలాలు, ఆర్మూర్ డివిజన్లోని ఒక మండలంలో పోలింగ్ జరునుంది. నిజామాబాద్ డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్లో జక్రాన్పల్లి మండలాల్లో మొత్తం 196 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి.
ఇందులో ఇప్పటికే 38 సర్పంచ్ స్థానాలు (sarpanch seats) ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 158 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 1760 వార్డు స్థానాలకు గాను 674 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 1,081 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 1,476 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 8 మండలాల్లో 2,38,838 మంది ఓటర్లు ఉన్నారు.