అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) రెండో విడత పోలింగ్ ప్రక్రియలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, నిజాంసాగర్, పిట్లం, మహమ్మద్ నగర్ మండలాల్లో ఆదివారం పోలింగ్ కొనసాగింది.
Panchayat Elections | మధ్యాహ్నం ఒంటి గంట వరకు..
ఆయా మండలాల్లో మధ్యాహ్నం ఒంటిగంటల వరకు పోలింగ్ జరిగింది. ఒంటి గంట తర్వాత కూడా క్యూలైన్లలో నిలబడిన వారికి ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 2,655 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Panchayat Elections | రికార్డు స్థాయిలో..
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) రికార్డుస్థాయిలో 86.08 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు జిల్లా అధికారులు వివరాలు వెల్లడించారు. మలి విడత పంచాయతీ ఎలక్షన్లో 1,41,424 మంది ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో రెండో విడతలో 154 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. కాగా.. ఇప్పటివరకు 44 గ్రామపంచాయతీలు, 776 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
Panchayat Elections | ఉదయం నుంచి చలిలోనూ ఓటింగ్..
జిల్లాలోని ఏడు మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఓటర్లు మందకొడిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. 9 గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదు కాగా.. 11 గంటల వరకు 58 శాతం, ఒంటి గంట వరకు 77.52 శాతం పోలింగ్ నమోదైంది. 9 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు (polling stations) ఓటర్లు భారీగా తరలివచ్చి వరుస కట్టారు. గాంధారి మండలంలో 85.22 శాతం, లింగంపేట మండలంలో 83.64 శాతం, మహమ్మద్ నగర్ మండలంలో 86.68 శాతం, నాగిరెడ్డిపేట మండలంలో 88.69 శాతం, నిజాంసాగర్ మండలంలో 88.73 శాతం, పిట్లం మండలంలో 84.12 శాతం, ఎల్లారెడ్డి మండలంలో 89.72 శాతం పోలింగ్ నమోదైంది.
Panchayat Elections | ఏడు మండలాల్లో..
ఏడు మండలాల్లో 1,64,301 మంది ఓటర్లు ఉండగా 67,768 మంది పురుషులు, 73,656 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 1,41,424 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఏడు మండలాల్లో ఎల్లారెడ్డి, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట, లింగంపేట, మహమ్మద్ నగర్ మండలాల్లో 86.08 శాతం ఓటింగ్ నమోదైంది.
Panchayat Elections | సాయంత్రంలోగా తేలనున్న అభ్యర్థుల కవితవ్యం
జిల్లాలోని 153 సర్పంచ్ స్థానాల్లో 506 మంది బరిలో నిలిచారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా.. 2 గంటలకు కౌంటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం కల్లా వీరి భవితవ్యం తేలనుంది. ఇక 873 వార్డుల్లో 2,655 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం ఫలితాల వెల్లడి పూర్తయ్యాక ఉప సర్పంచ్‌ను కూడా నేడు ఎన్నుకోనున్నారు.