HomeUncategorizedGPO Posts | జీపీవో పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్​

GPO Posts | జీపీవో పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: GPO Posts | రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ గ్రామ పాలన అధికారిని నియమించాలని నిర్ణయించింది. గతంలో బీఆర్​ఎస్ హయాంలో వీఆర్​వో, వీఆర్​ఏ వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో భూభారతి రెవెన్యూ చట్టాన్ని(Bhu Bharati Revenue Act) తీసుకు వచ్చింది. దీనిని పకడ్బందీగా అమలు చేయడానికి గ్రామస్థాయిలో అధికారి ఉండాలని భావించింది. ఇందులో భాగంగా జీపీవోలను నియమించనుంది.

GPO Posts | ఇప్పటికే 3,550 మంది ఎంపిక

రాష్ట్రవ్యాప్తంగా 10,954 మంది జీపీవోలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వీఆర్​వో, వీఆర్​ఏలుగా పని చేసిన వారికి మొదట అవకాశం కల్పించాలని భావించింది. ఇందులో భాగంగా వారికి అవకాశం కల్పించి గతంలో నోటిఫికేషన్​(Notification) విడుదల చేశారు. మే 25న పరీక్ష నిర్వహించగా.. 3,550 మంది జీపీవోలు ఎంపికయ్యారు. అయితే మరోసారి వీఆర్​వో, వీఆర్​ఏలకు అవకాశం ఇవ్వాలని భావించింది.

దీంతో తాజాగా రెండో విడత నోటిఫికేషన్​ విడుదల చేసింది. గతంలో వీఆర్​ఏ(VRA), వీఆర్​వో(VRO)లుగా పని చేసి జీపీవోలుగా పని చేయడానికి ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16లోపు ఆయా జిల్లాల కలెక్టరేట్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచిందింది. వీరికి ఈ నెల27న పరీక్ష నిర్వహించనుంది. రెండో విడతలో సుమారు 1500 నుంచి రెండు వేల మంది జీపీవో(GPO)లుగా ఎంపిక అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.

GPO Posts | మిగతా పోస్టులు డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ ద్వారా..

ప్రభుత్వం మొత్తం 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. రెండో విడత పరీక్ష అనంతరం మిగిలిన పోస్టులను డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​(Direct Recruitment) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు ఆరు వేల పోస్టులను నేరుగా పరీక్ష పెట్టి భర్తీ చేయనుంది. త్వరలో నోటిఫికేషన్​ విడుదల చేసి నియామక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో సర్వేయర్లు(Surveyors), జీపీవోల పాత్ర కీలకం అని ప్రభుత్వం చెబుతోంది. దీంతో జీపీవోలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల సర్వేయర్లను కూడా నియమించినుంది. కాగా జీపీవో పోస్టులకు ఇంటర్​ చదివిన వారు అర్హులని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్​ వెలువడితే గాని స్పష్టత వచ్చే అవకాశం లేదు.