అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (domestic stock market) లాభాల బాటలో పయనించింది. కేంద్ర బడ్జెట్‌కు (Union Budget) ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ గరిష్టాల వద్ద లాభాలు స్వీకరించడంతో సూచీలు కొంత ఒత్తిడికి లోనయినా.. తేరుకుని లాభాలతో ముగిశాయి.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 35 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 611 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 616 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 114 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 147 పాయింట్లు పడిపోయింది. చివరి గంటలో ప్రధాన సూచీలు గణనీయంగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో 82,344 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 25,342 వద్ద స్థిరపడ్డాయి.
స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్ విశేషంగా రాణించాయి. క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇండస్ట్రియల్, పవర్, ఎనర్జీ రంగాల షేర్లు దూకుడు ప్రదర్శించగా.. ఎఫఎంసీజీ, కన్జూమర్ డ్యూరెబుల్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,920 కంపెనీలు లాభపడగా 1,315 స్టాక్స్ నష్టపోయాయి. 138 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 86 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 261 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 14 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 13 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 4.45 లక్షల కోట్లు పెరిగింది.
Stock Markets | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభపడగా.. 8 కంపెనీలు నష్టపోయాయి. బీఈఎల్ 9.04 శాతం, ఎటర్నల్ 5.23 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.28 శాతం, పవర్‌గ్రిడ్ 1.97 శాతం, ట్రెంట్ 1.82 శాతం పెరిగాయి.
Stock Markets | Top losers..
ఆసియన్ పెయింట్ 4.26 శాతం, మారుతి 2.43 శాతం, సన్‌ఫార్మా 1.80 శాతం, ఇన్ఫోసిస్ 1.18 శాతం, ఎయిర్టెల్ 0.85 శాతం నష్టపోయాయి.