అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Moneylenders | వడ్డీ వ్యాపారుల తీరుతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీ(High Interest)కి అప్పులు ఇస్తూ పలువురు వ్యాపారులు ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో దాడులు చేపట్టారు.
నిజామాబాద్ నగరం(Nizamabad City)లో చాలా మంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రజలకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు మెరుపు దాడులు చేశారు. మూడో టౌన్, నాలుగో టౌన్, ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
Moneylenders | పలు పత్రాలు స్వాధీనం
తనిఖీల సమయంలో పోలీసులు ప్రామిసరీ నోట్లు(Promissory Notes), డాక్యుమెంట్లు, అప్పు తీసుకున్న వారు ఇచ్చిన చెక్కులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమంగా దాచి ఉంచిన నగదును కూడా ఈ సోదాలో పరిశీలిస్తున్నారు. వడ్డీ వ్యాపారులతో(Moneylenders) ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలావరకు పేద మధ్యతరగతి ప్రజలు బలవుతున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. ఇటీవల కేసులు కూడా నమోదు చేశారు. దీంతో సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అరికట్టడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ సౌత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఆయా ఠాణాల ఎస్‌హెచ్‌వోలు వో రఘుపతి, హరిబాబు, శ్రీకాంత్, గంగాధర్, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.
Moneylenders | గతంలో సైతం
ఉమ్మడి జిల్లాలో గతంలో సైతం పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో దాడులు చేపట్టారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టి కేసులు నమోదు చేశారు. అయినా వ్యాపారులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. మెండోరా పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీపీ సాయిచైతన్య జూన్‌లో సస్పెండ్ చేశారు.