ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar backwater | నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో కొనసాగుతున్న గాలింపు చర్యలు.. ఒకరి మృతదేహం...

    Nizamsagar backwater | నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో కొనసాగుతున్న గాలింపు చర్యలు.. ఒకరి మృతదేహం లభ్యం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar backwater : కామారెడ్డి జిల్లా(Kamareddy district) ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట్ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుల కోసం రెస్క్యూ బృందాలు(Rescue teams) గాలిస్తున్నాయి. తెల్లవారుజామునే ప్రత్యేక బలగాలు, గజ ఈతగాళ్లతో యువకుల కోసం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో రెస్కూ ఆపరేషన్​ చేపట్టారు. గల్లంతైన ముగ్గురిలో మధుకర్​ మృతదేహం లభ్యమైంది.

    నిన్న(సోమవారం) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన యువకుల జాడ కోసం వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నీటి వద్దకు చేరుకున్నారు. సోమార్​పేట్​ గ్రామ శివారులోని పిప్పిర్యాగడి తండా సమీపం వద్ద నిజాంసాగర్ బ్యాక్ వాటర్​లో 11 మంది యువకులు సరదాగా ఈతకు వెళ్లారు. వీరిలో ముగ్గురు చాలా లోపలికి వెళ్లి గల్లంతయ్యారు. మిగతా యువకులు ఒడ్డుకు చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గల్లంతైన వారిని ఎల్లారెడ్డి, కళ్యాణి , సోమర్ పేట్ గ్రామాలకు చెందిన మధుకర్ గౌడ్ (17), నవీన్ (23), హర్షవర్ధన్ (17)గా గుర్తించారు.

    విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి అధికారులు చేరుకున్నాక సహాయక చర్యలు చేపట్టారు. చీకటి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మధుకర్​ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది. గల్లంతైన యువకుల కోసం వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యువకుల గల్లంతుతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

    More like this

    September 3 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 3 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 3,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Teenmar Mallanna comments | ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న ఘాటైన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

    Teenmar Mallanna comments | భారాస నుంచి తిరస్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు...

    Pawan birthday celebrations | ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Pawan birthday celebrations : పవర్​ స్టార్ Power Star​, ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh ఉప...