అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal | జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన జలశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. నిజాంసాగర్ (Nizamsagar), లెండి (Lendi Project) ప్రాజెక్టుల్లోనూ వరద భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బిచ్కుంద (Bichkunda) మండలంలో గొర్రెల కాపర్లు వాగులో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
బిచ్కుంద మండలంలోని శెట్లూరు వాగు (Shetlur vaagu) వద్ద మంజీరలో సుమారు 500 గొర్రెలను ముగ్గురు గొర్రెల కాపర్లు మేతకు తీసుకెళ్లారు. భారీ వర్షాల కారణంగా వాగులో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వరదలో వారు చిక్కుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Banswada Sub Collector Kiranmayi) అప్రమత్తమయ్యారు. అధికారులతో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంజీరలో చిక్కుకున్న వారిని బిచ్కుంద మండలం కండెబల్లూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాగు అవతలికి చేరుకుని తాడుసాయంతో గొర్రెల కాపర్లను సురక్షితంగా రక్షించారు. బిచ్కుంద తహశీల్దార్ వేణుగోపాల్, బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు గొర్రెల కాపరుల కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
శెట్లూర్ వాగులో చిక్కుకున్న గొర్రెలు, గొర్రెల కాపరులు