అక్షర టుడే, ముప్కాల్: Mupkal Mandal | గతంలో రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనను గురువారం నిర్వహించారు. ఆర్మూర్ (Armoor) సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా (Armoor Sub-Collector Abhigyan malviya) ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
సదస్సులో ప్రజలు చేసిన భూ సమస్యలు, పింఛన్లు, ఆదాయ ధృవపత్రాలు, కుల ధ్రువపత్రాలు, తదితర అంశాలపై దరఖాస్తులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ ముంతాజుద్దీన్, డిప్యూటీ తహశీల్దార్ వసంత్ రావ్, ఆర్‌ఐ రాఘవేంద్రరావు, ఏఆర్‌ఐ రవి, మండల సర్వేయర్ అంజలి, తదితరులు పాల్గొన్నారు.