అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు భారీగా నామినేషన్లు (Nominations) దాఖలు అయిన విషయం తెలిసిందే. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు స్వీకరించారు. అయితే ఇందులో 186 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి.
ఎన్నికల అధికారులు బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఎక్కువ మొత్తంలో నామినేషన్లు రావడంతో రాత్రి వరకు ప్రక్రియ సాగింది. క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా లేని వాటిని రిజెక్ట్ చేశారు. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం 186 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 135 నామినేషన్లను ఓకే చేశారు. దీంతో ప్రస్తుతం 81 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Jubilee Hills by-election | వివిధ కారణాలతో..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ నిరసన తెలపడానికి చాలా మంది నామినేషన్ వేశారు. చివరి రోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటెత్తారు. నిరుద్యోగులు, ఆర్ఆర్ఆర్ బాధితులు, ఫార్మా సిటీలో భూములు కోల్పోతున్న వారు నామినేషన్లు ఫైల్ చేశారు. అయితే ఇందులో చాలా మంది సరైన ఫార్మాట్‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా నమోదు చేశారు. దీంతో వారి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
Jubilee Hills by-election | విత్‌డ్రాకు అవకాశం
నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం వరకు అవకాశం ఉంది. ప్రస్తుతం బరిలో 81 మంది ఉన్నారు. వీరిలో ఎంత మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకుంటారో చూడాలి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలనుంది. కాగా ఉప ఎన్నికకు నవంబర్ 11న జరగనుండగా 14న కౌంటింగ్ చేపట్టనున్నారు.
2 comments
[…] జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై (Jubilee Hills by-election) గట్టి నిఘా పెట్టామని, ముగ్గురు […]
[…] జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election) రూపంలో మరోసారి అవకాశం వచ్చింది. […]
Comments are closed.