RBSK Health Team
RBSK Health Team | విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి

అక్షరటుడే, బాన్సువాడ: RBSK Health Team | విద్యార్థులకు చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు గుర్తించి వైద్యం చేయించాలని డిప్యూటీ డీఎంహెచ్​వో (Deputy DMHO vidya), ఆర్​బీఎస్​కే ప్రోగ్రాం అధికారిణి విద్య సూచించారు.

శనివారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో రాష్ట్రీయ బాలస్వస్థ్య కార్యక్రమం(ఆర్​బీఎస్​కే)పై మొబైల్ హెల్త్ టీం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి పాఠశాలలో మొబైల్ టీం సభ్యులు విద్యార్థులకు ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు (Basic screening tests) నిర్వహించాలని పేర్కొన్నారు. చిన్నారుల్లో లోపాలను గుర్తించి అవసరమైన వారికి చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు విక్రమ్, అర్జున్, సీహెచ్​వో దయానంద్ తదితరులు పాల్గొన్నారు.