HomeUncategorizedViral Video | బాయ్‌ఫ్రెండ్‌కి చిరాకు తెప్పించిన మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో వైర‌ల్

Viral Video | బాయ్‌ఫ్రెండ్‌కి చిరాకు తెప్పించిన మ‌హిళ‌.. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో వైర‌ల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | దేశంలో వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ముఖ్యంగా నగరాల్లో రోడ్లు చిన్నచిన్న చెరువుల్లా మారిపోయాయి. వర్షపు నీరు రోడ్ల‌పై న‌దుల్లా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో, ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మ‌హిళ మొండిత‌నం ఆమెకు లేని పోని చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతోంది.

Viral Video | మొండిత‌నం..

రోడ్ల‌న్నీ వ‌ర్ష‌పు నీటితో (Rain Water) నిండిపోయి ఉండ‌గా, వీడియోలో మ‌నకు ఒక అబ్బాయి, అమ్మాయి కనిపిస్తున్నారు. వారి స్కూటీ నీటిలో చిక్కుకుపోయింది. అయితే ఆ అబ్బాయి స్కూటీని వ‌ర్షపు నీటి నుండి బయటకు తీయడానికి చాలా ప్రయత్నించాడు. అయితే ఎంత ప్ర‌య‌త్నించినా అస్సలు కదలలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అబ్బాయి క‌ష్ట‌ప‌డుతున్నంత సేపు అమ్మాయి స్కూటీపైనే (Scooty) కూర్చునే ఉంది. స్కూటీ కదలక చివరకు బ్యాలెన్స్‌ ఆగక కిందపడిపోయింది. దీంతో స్కూటీపై కూర్చున్న‌ అమ్మాయి కూడా నీటిలో పడిపోయింది. అయితే ఆ అమ్మాయి ముందే స్కూటీ దిగి ఉంటే ఇలా జ‌రిగి ఉండేది కాదు క‌దా అని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండ‌గా, దీనిపై నెటిజ‌న్స్ భిన్న‌మైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ ఆమెకు పెద్దగా గాయాలు కాకపోయినా, ఇది ఒక హెచ్చరికగా మారింది. వర్షాకాలంలో ఇలాంటి అనవసర ప్రయోగాలు చేయ‌కుండా, మొండితనాన్ని వీడి జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు. “జీవితం ముఖ్యం, స్కూటీ తర్వాత కూడా బాగు చేయించొచ్చు” అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వర్షాకాలంలో ప్రాణాలకు ప్రమాదం కలిగే పరిస్థితుల్ని తక్కువ అంచనా వేయకండని, అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేయాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రికి గుణ పాఠం అవుతుంద‌ని కూడా కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Fuddu Sperm️ (@fuddu_sperm)