అక్షరటుడే, మెండోరా: Mendora | మెండోరా మండలం దూదిగాంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం (Agricultural Research Center) శాస్త్రవేత్తలు శుక్రవారం పర్యటించారు.
నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన రైతు రాజేందర్ పొలంలో సాగుచేస్తున్న ఆర్డీఆర్ 1200 రకం వరి క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాకేశ్, కృష్ణ చైతన్య, ఏవో వసంత్, ఏఈవో సాయికృష్ణ, రైతులు పాల్గొన్నారు.