అక్షరటుడే, వెబ్‌డెస్క్: Science Museum | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్‌సీఎస్ఎం) National Council of Science Museums ఆధ్వర్యంలోని మ్యూజియంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. టెక్నిషియన్స్ Technicians, టెక్నికల్ అసిస్టెంట్లు Technical Assistants, ఆర్టిస్ట్, ఆఫీస్ అసిస్టెంట్లు కలిపి 30 పోస్టులకు అర్హులైన వారిని దరఖాస్తులను ఎన్‌సీఎస్ఎం NCSM ఆహ్వానిస్తోంది. ఏదైనా డిప్లొమా పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోల్‌కతా Kolkata, భువనేశ్వర్ Bhubaneswarలలో పని చేయాల్సి ఉంటుంది.
Science Museum | మే 26 వరకు గడువు
దరఖాస్తుల స్వీకరణకు మే 26 వరకు గడువు విధించారు. 24.05.2025 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.38,908 వేతనం ఇస్తారు. విద్యార్హతతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ NCSM.gov.in/Notice/Career లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఓసీలు అయితే రూ.885 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ Ex-Servicemen Category వారికి ఉచితం.
Science Museum | అర్హతలు ఇవే..
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ Computer Science, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. 13 టెక్నిషియన్ పోస్టులు ఉండగా, అందులో ఐదు ఫిట్టర్; 6 కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఒక్కోటి చొప్పున పోస్టులు ఉన్నాయి. తొమ్మిది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, ఒకటి ఎలక్ట్రానిక్స్, రెండు చొప్పున ఎలక్ట్రికల్, కంప్యూటర్, మెకానికల్, సివిల్ పోస్టులు ఉన్నాయి. రెండు ఆర్టిస్ట్ పోస్టులు, ఆరు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కోల్‌కతా, భువనేశ్వర్‌లోని వివిధ సంస్థల్లో గల ఆయా పోస్టులు అభ్యర్థులు మే 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి.